![]() |
![]() |
.webp)
ఢీ సెలబ్రిటీ స్పెషల్ ఈ వారం షోలో పాన్ ఇండియా కొరియోగ్రాఫర్ గా అవతారం ఎత్తాడు. ఈ వారం షోకి బబుల్ గం టీమ్ నుంచి రోషన్ కనకాల, మానస వచ్చారు.. ఐతే బబుల్ గం సీక్వెల్ కి ఒక డాన్స్ కి కోరియోగ్రఫీ చేయాలంటూ రోషన్ హైపర్ ఆదిని అడిగాడు. ఆయనలో ఒక స్టైల్, ఒక స్వాగ్ ఉంది అందుకే ఆయన్నే కొరియోగ్రాఫ్ చేయమని అడిగానన్నాడు రోషన్. ఆది రోషన్ కి నేర్పించిన స్టెప్స్ సరిగా వేయకపోయేసరికి "బబుల్ గం - 2 కి నువ్వు హీరోవి కాదు నేనే హీరోని, ఈమె హీరోయిన్" అని చెప్పి షాకిచ్చాడు.
ఇక రోషన్ కి ఆది అసలు కొరియోగ్రాఫర్ కాదన్న విషయం తెలిసి "అసలు మేము నేర్పించమన్నది ఏమిటి నువ్వు నేర్పించింది ఏమిటి " అని ఆది కాలర్ పట్టుకుని అడిగాడు రోషన్. "సుమ గారి కొడుకువని ఊరుకుంటున్నా" అని ఆది అన్నాడు " నేను సుమ గారి కొడుకునే కాదు ఏమిటిప్పుడు బుధవారం అంటున్నావు కాబట్టి వదిలేస్తున్నా శనివారం కలుద్దాం...ఫైటింగ్ చేసుకుందాం..ఎవరో తేల్చుకుందాం " అని రోషన్ అనేసరికి "శనివారం నేను ఫైటింగులు గట్రా చేయను..నెల్లూరు లో ఈవెంట్ ఉంది నన్ను వదిలేయ్ " అన్నాడు ఆది. "మీరు పేరు ఆది కాబట్టి ఆదివారం కలుద్దాం" అన్నాడు రోషన్. ఇంతలో ఆది అక్కడి నుంచి వెళ్ళిపోతూ "నా పేరు హైపర్ ఆది..కమెడియన్ అసలు నీకు నేను కొరియోగ్రాఫర్ అని ఎవరు చెప్పారు" అని ఫీలైపోయాడు ఆది. "నువ్వు హైపర్ ఆది.. నేను హైపర్ ఐతే ఎలా ఉంటుందో చెప్పనా రేపొద్దున్న ట్యాంక్ బండ్ లో తేలుతావ్ చెప్తున్నా" అని రోషన్ గట్టిగా వార్నింగ్ ఇచ్చేసరికి "నేను ఢీలోనే తేల్తా" అని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు.
![]() |
![]() |